చర్చలతోనే అన్ని సమస్యలకు పరిష్కారం

18 Nov, 2017 04:37 IST|Sakshi

లక్నో: ఎలాంటి సమస్యలనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీశ్రీ రవిశంకర్‌ అన్నారు. రామ జన్మభూమి వివాద పరిష్కారానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఆయన శుక్రవారం అయోధ్యలో పలువురు ముస్లిం మతపెద్దలతో సమావేశమయ్యారు. ఫారంగి మహల్‌ ఇస్లామిక్‌ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా రెక్టర్, ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డులో సీనియర్‌ సభ్యుడైన మౌలాని ఖాలిద్‌ రషీద్‌ ఫారంగిమహలి రవిశంకర్‌ను కలుసుకున్న వారిలో ఉన్నారు. ఈ వివాద పరిష్కారం ఇప్పటికే ఆలస్యమైందని, త్వరలోనే దీనికి ముగింపు పలకాలని కోరుకుంటున్నట్లు రవిశంకర్‌ తెలిపారు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు