ఎస్ఆర్ఎం విద్యాసంస్థల అధినేత అరెస్ట్!

27 Aug, 2016 07:49 IST|Sakshi
ఎస్ఆర్ఎం విద్యాసంస్థల అధినేత అరెస్ట్!

చెన్నై: ఎస్ఆర్ఎం విద్యాసంస్థల అధినేత టీఆర్ పచ్చముత్తును సీఐడీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మోసం సహా ఆయనపై మూడు కేసులు నమోదు చేశారు. ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీ ఛాన్సలర్, ఐజేకే పార్టీ వ్యవస్థాపకుడైన పచ్చముత్తను గురువారం రాత్రి విచారణకు పిలిచారు. అయితే ఆయన అరెస్ట్ ను సీఐడీ ధ్రువీకరించలేదు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో మెడికల్ సీట్ల కోసం డబ్బు కట్టినా తమకు అడ్మిషన్లు ఇవ్వలేదని 100 మందిపైగా విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు.

పచ్చముత్తుకు సన్నిహితుడైన సినీ నిర్మాత ఎస్. మదన్ తమకు సీట్లు ఇప్పిస్తామని డబ్బు తీసుకున్నాడని బాధితులు ఆరోపించారు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లేఖ రాసి మే నెలలో మదన్ అదృశ్యం కావడంతో పచ్చముత్తు చిక్కుల్లో పడ్డారు. మదన్ దాదాపు రూ. 70 కోట్లు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. మద్రాస్ హైకోర్టు ఆదేశంలో పచ్చముత్తును సీఐడీ అధికారులు విచారణకు పిలిచారు. కాగా, ఎస్ఆర్ఎం విద్యాసంస్థలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే అమరావతిలో 200 ఎకరాలు కేటాయించింది. 

మరిన్ని వార్తలు