ఎస్‌ఆర్‌ఎస్‌ నివేదికలో షాకింగ్‌ విషయాలు

2 Jul, 2020 11:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నూఢిల్లీ: సాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌(ఎస్‌ఆర్‌ఎస్‌)-2018 నివేదిక ఆందోళన కలిగించే అంశాలు వెల్లడించింది. ఐదేళ్లలోపు మరణిస్తున్న చిన్నారుల్లో మధ్యప్రదేశ్‌ ప్రథమ స్థానంలో ఉన్నట్లు తెలిపింది. దేశ వ్యాప్తంగా ఐదేళ్లలోపు మరణిస్తున్న చిన్నారుల్లో 20శాతం మరణాలు మధ్యప్రదేశ్‌లోనే సంభవిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. అంటే దేశ వ్యాప్తంగా మరణిస్తున్న ఐదేళ్లలోపు చిన్నారుల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు మధ్యప్రదేశ్‌కు చెందిన వారే ఉన్నారు. రెండు శాతం మరణాల రేటుతో కేరళ చివరి స్థానంలో ఉన్నట్లు నివేదిక తెలిపింది. మధ్యప్రదేశ్‌ తరువాతి స్థానంలో ఉత్తర ప్రదేశ్‌, రాజస్తాన్‌, బిహార్‌ రాష్ట్రాలు ఉన్నాయి. ఐదేళ్లలోపు మరణిస్తున్న చిన్నారుల్లో ప్రతి ఆరుగురిలో ఒకరు ఈ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. శిశుమరణాల రేటులో తమిళనాడు, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలు కేరళ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. 

దేశ వ్యాప్తంగా ఐదేళ్లలోపు మరణిస్తున్న చిన్నారులు సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో తక్కువగా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో పట్టణ ప్రాంతాల్లో సంభవిస్తున్న మరణాలకు, గ్రామీణ ప్రాంతాల్లో సంభవిస్తున్న మరణాల రేటుకు చాలా వ్యత్యాసం ఉంది. అస్సాంలో గ్రామీణ ప్రాంతాల్లో శిశు మరణాల రేటు 16.5 శాతం ఉండగా.. పట్టణాల్లో 6శాతం మాత్రమే ఉంది. మధ్యప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో శిశు మరణాల రేటు 22 శాతం ఉండగా.. పట్టణ ప్రాంతంలో 13.4శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడంతో శిశు మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. అయితే  కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఉత్తరాఖండ్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో పట్టణ ప్రాంతాల్లో శిశుమరణాల రేటు ఎక్కువగా ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా ఉంది.  రాష్ట్రాల వారిగా వివరాలు..

మరిన్ని వార్తలు