కలాం విగ్రహ ఏర్పాట్లు సందర్శించిన ప్రత్యేక బృందం

18 Jul, 2016 16:26 IST|Sakshi

రామేశ్వరంః మాజీ రాష్ట్రపతి, దివంగత ఎపిజె అబ్దుల్ కలాం కాంస్య విగ్రహాన్ని రామేశ్వరంలో ప్రతిష్టించనున్నారు. జూలై 27న జరగనున్న విగ్రహ స్థాపనకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను  పర్యవేక్షించేందుకు రక్షణ మంత్రిత్వశాఖ, ఇండియన్ కోస్ట్ గార్డు అధికారులతో కూడిన బృందం ఆ ప్రదేశాన్ని సందర్శించింది.

రక్షణ మంత్రిత్వశాఖ, ఇండియన్ కోస్ట్ గార్డు అధికారులు రామేశ్వరంలో పర్యటించారు. మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం కాంస్య విగ్రహం ఏర్పాటుకోసం జరుగుతున్న పనులను పర్యవేక్షించారు.  మాజీ రాష్ట్పపతి మొదటి వర్థంతి సందర్భంలో జూలై 27న ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. అదే ప్రాంతంలో కలాం స్మారక చిహ్నంగా  ఓ లైబ్రరీని, మ్యూజియం ను సైతం నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే సిబ్బందికోసం హౌసింగ్ క్వార్టర్స్ ను కూడా నిర్మించనున్నట్లు వెల్లడించారు. పర్యవేక్షణ బృందంతోపాటు మండపం కోస్ట్ గార్డ్ కమాండర్ రామ్మోహన్ రావు, అబ్దుల్ కలాం మేనల్లుడు షేక్ సలీం కూడా  హాజరై విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలించారు.

మరిన్ని వార్తలు