రాజీవ్ హంతకుల విడుదలపై స్టే

28 Feb, 2014 01:12 IST|Sakshi

 న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హత్య కేసులో జయలలిత ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో దోషులుగా తమిళనాడు జైలులో ఉన్న మరో నలుగురి విడుదలపై కూడా సుప్రీంకోర్టు స్టే విధించింది. రాజీవ్ హత్య కేసులో మురుగన్, శంతన్, అరివుల మరణశిక్షను జీవితఖైదుగా మారుస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు అనంతరం వీరి ముగ్గురితో పాటు ఇదే కేసులో శిక్ష అనుభవిస్తున్న నళిని, రాబర్డ్ పయస్, జయకుమార్, రవిచంద్రన్‌లను విడుదల చేయాలని తమిళనాడు సర్కా రు నిర్ణయించింది. దీనిపై కేంద్రం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ధర్మాసనం గురువారం స్టే విధించింది. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తామంటూ విచారణను మార్చి 6కు వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు