‘స్టింగ్ కింగ్’ తేజ్‌పాల్ పతనం

30 Dec, 2013 01:18 IST|Sakshi

 క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్, రక్షణ కొనుగోళ్లలో ముడుపులు వంటి అక్రమాలను స్టింగ్ ఆపరేషన్లతో బట్టబయలు చేసిన తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ ప్రతిష్ట మట్టిగొట్టుకుపోయింది ఈ ఏడాదే. తన కుమార్తె స్నేహితురాలు, తన పత్రికలోనే పనిచేస్తున్న మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. నవంబర్‌లో గోవాలోని ఓ హోటల్ లిఫ్టులో   ఆయన తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని మహిళా జర్నలిస్టు ఆరోపించడంతో తేజ్‌పాల్‌ను అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు