ఎయిరిండియా విమానానికి తప్పిన ముప్పు

14 Aug, 2019 08:50 IST|Sakshi

రన్‌వేపైకి వీధి కుక్కల  స్వైర విహారం

చివరి నిమిషంలో​ అప్రమత్తమైన  పైలట్‌

మరో మార్గంలో విమానం  సురక్షితంగా ల్యాండింగ్‌

పనాజీ: గోవాదబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం ఒక పెద్ద ప్రమాదం తప్పింది. రన్‌వేపై అకస్మాత్తుగా వీధికుక్కలు దర్శనమివ్వడంతో,అప్రమత్తమైన పైలట్‌ చివరి నిమిషంలో ల్యాండింగ్‌ను నిలిపివేశారు. ఈ మేరకు భారత నావికాదశం ఒక ప్రకటన విడుదల చేసింది. 

ముంబై నుంచి గోవాకు వస్తున్న ఎయిరిండియా ప్యాసింజర్ విమానం (ఏఐ033)  నిన్న (ఆగస్టు13, మంగళవారం తెల్లవారుజామున) ఈ ఘటన చోటు చేసుకుంది. చీకటిగా ఉండటంతో ఎయిర్‌ ట్రాఫిక్‌ నియంత్రణ సిబ్బంది కుక్కలను గమనించ లేపోయారని తెలిపింది. విమానాశ్రయం రన్‌వే సమీపంలో కుక్కలు, పక్షుల బెడదనుంచి  బయటపడేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని భారత నావికాదళం విడుదల చేసిన  ఒక ప్రకటనలో వెల్లడించింది. 

మరిన్ని వార్తలు