స్ట్రెచర్‌ లేదని నడిపించారు!

2 Feb, 2018 01:52 IST|Sakshi
స్ట్రెచర్‌

కాన్పు గదికి వెళ్తుండగా నిండు గర్భిణీ ప్రసవం 

కిందపడి శిశువు మృతి

బేతుల్‌: ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఒక శిశువు నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌ జిల్లా ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘోడాడోంగ్రికి చెందిన వికాస్‌ వర్మ భార్య నీలూ నిండు గర్భిణీ. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు లేకపోవటంతో అంబులెన్స్‌ లో బేతుల్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

నీలూ వర్మను స్ట్రెచర్‌పై తీసుకెళ్లాల్సిన ఆస్పత్రి సిబ్బంది.. కాన్పుగదికి నడిపిస్తు్తండగానే ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. నేలపై పడిన శిశువు అక్కడికక్కడే చనిపోయింది. తమ సిబ్బంది నిర్లక్ష్యమే ఇందుకు కారణమని, బాధ్యులపై చర్యలు తీసు కుంటామని ఆస్పత్రి సివిల్‌ సర్జన్‌ ఏకే బరంగా తెలిపారు.   

మరిన్ని వార్తలు