గోవులను వధించకుండా కొత్త చట్టం

22 Nov, 2015 18:32 IST|Sakshi

నార్నల్(హర్యానా): త్వరలో గోవు సంరక్షణ చట్టం రాబోతుందని, అది వచ్చిన తర్వాత ఎవరైనా గోవధకు పాల్పడినా, వాటిని అమ్మినా, తిన్నట్లు తెలిసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ అన్నారు. గో సంరక్షణ చట్టం చేసేందుకు బిల్లును రూపొందించామని, దానికి సంబంధించి ఈ నెల 19న నోటిఫికేషన్ కూడా ఇచ్చామని రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత దానిని ప్రవేశపెడతామని చెప్పారు.

ఈ చట్టం అమలుచేసిన తర్వాత ఎవరైనా తప్పిదాలకు పాల్పడితే మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే బిల్లు 90 మందిచే అసెంబ్లీలో ఆమోదం పొందిందని, ఆ బిల్లును ఆమోదించినవారిలో ముస్లింలు కూడా ఉన్నారని ఆయన చెప్పారు. ఈ బిల్లు తీసుకురావడంలో ముస్లింలు కూడా ఎంతో సహకరించారని, బిల్లు రూపొందించే దశ నుంచి చట్ట సభలోకి తీసుకెళ్లే వరకు ఏ రకమైన సహాయమైనా తాము అందించేందుకు సిద్ధమని వారు చెప్పారని వివరించారు. ఇక నుంచి హర్యానాలో గోవధ మాత్ర ఉండదని చెప్పారు.

మరిన్ని వార్తలు