విమానాన్ని ఢీకొన్న నిచ్చెన : ధ్వంసమైన రెక్కలు

6 Jun, 2020 16:02 IST|Sakshi

ముంబై : బలమైన ఈదురు గాలులు ముంబై విమానాశ్రమయంలో బీభత్సం సృష్టించాయి. వేగంగా వీచిన ఈదురుగాలుల కారణంగా ముంబై విమానాశ్రయంలో స్పైస్‌ జెట్ విమానం నిచ్చెన.. అక్కడే ఆగిఉన్న ఇండిగో విమానాన్ని ఢీకొట్టింది. దీంతొ ఇండిగో విమానం రెక్కలు, ఇంజిన్‌ను కప్పిఉంచే భాగం ధ్వంసమైంది.  శనివారం వీచిన ఈదురుగాలులు, అధిక వర్షపాతంతో ముంబై నగరం జలమయమైన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఉదయం 7.30 గంటల ప్రాంతంలో  ఈ ఘటన చోటు చేసుకుంది.  బలమైన గాలుల కారణంగా నిచ్చెన ఉన్న ప్రాంతం నుంచి వెనక్కి రావడంతో ఇండిగో విమానం రెక్కకి తగిలి విరిగిపోయినట్లు మీడియాల్లో వచ్చిన ఫొటోల ద్వారా తెలుస్తోంది. ఆ సమయంలో రెండు విమానాలు కూడా విమానాశ్రయంలోనే నిలిపివున్నాయని స్పైస్ జెట్ తెలిపింది.‘ఈ ప్రమాదం ముంబై విమానాశ్రయంలో శనివారం తెల్లవారుజామున జరిగింది. స్పైస్ జెట్‌కు చెందిన విమానం మెట్ల నిచ్చెన దాని ఆపి ఉంచిన స్థానం నుండి వేరుచేయబడి ఇండిగోకు చెందిన విమానాన్ని బలంగా తాకింది. ఈ ప్రమాదంలో ఇండిగో విమాన రెక్కలు ధ్వంసమైయ్యాయి.  ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు’ అని స్పైస్‌ జెట్‌ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు.

మరిన్ని వార్తలు