త్వరలో ఏకకాలంలో రెండు డిగ్రీలు

22 May, 2020 06:16 IST|Sakshi

న్యూఢిల్లీ: ఒకే సమయంలో రెండు డిగ్రీలను పూర్తి చేసే అవకాశం త్వరలో అమలయ్యేలా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ ఆమోదం తెలిపిందని అధికారులు తెలిపారు. అయితే ఇందులో ఒక డిగ్రీని రెగ్యులర్‌ మోడ్‌లోనూ, మరోటి ఆన్‌లైన్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌(ఓడీఎల్‌) ద్వారా చేయాల్సి ఉంటుందని యూజీసీ కార్యదర్శి రజనీశ్‌ జైన్‌ స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెల్లడించే అవకాశం ఉందన్నారు. ఈ వ్యవహారంపై గతేడాది యూజీసీ వైస్‌ చైర్మన్‌ భూషన్‌ పట్వర్థన్‌ ఆధ్వర్యంలో కమిటీ వేయడం తెల్సిందే. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు