వైరస్‌ భయం కంటే ఆర్థిక భయాలే అధికం

24 May, 2020 19:54 IST|Sakshi

సీఎంఈఈ సర్వే

సాక్షి, న్యూఢిల్లీ : ప్రజలు కరోనా మహమ్మారి కంటే ఈ వ్యాధి ప్రభావంతో ఎదురయ్యే ఆర్థిక సంక్షోభం గురించే ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని తాజా సర్వే స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌లో ప్రజల మనోగతంపై సీఎంఈఈ ఆధ్వర్యంలో ఐఐఎం లక్నో ఈ సర్వే చేపట్టింది. 23 రాష్ట్రాల్లోని 104 నగరాల్లో ఈ అథ్యయనం పలువురిని పలుకరించింది. వీరిలో అత్యధికులు లాక్‌డౌన్‌తో తలెత్తే ఆర్థిక సమస్యలపైనే ఆందోళన చెందుతున్నామని చెప్పినట్టు వెల్లడైంది.

ఇక లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత ప్రజల ప్రవర్తన హేతుబద్ధంగా ఉండబోదనే భయం వెంటాడుతోందని మరికొందరు తెలిపారు. మహమ్మారి ప్రభావంతో​ ఆర్ధిక సమస్యలు చుట్టుముడతాయని అత్యధికంగా 32 శాతం మంది ఆందోళన చెందగా, లాక్‌డౌన్‌లో ప్రజలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంపై 15 శాతం మంది స్పందించారు. ఇక వైరస్‌ సోకుతుందనే భయంతో ఉన్నామని చెప్పినవారు కేవలం 14 శాతం కావడం గమనార్హం.

చదవండి : వృద్ధ జంటకు సానియా, అనుష్క ఫిదా

మరోవైపు వైరస్‌ను ఎదుర్కోవడంలో ప్రభుత్వం చేపట్టిన చర్యల పట్ల ప్రతి 5గురిలో ముగ్గురు సంతృప్తి వ్యక్తం చేశారు. మార్చి 25-మే 3 మధ్య లాక్‌డౌన్‌ అమలవుతున్న వ్యవధిలో ఫేస్‌బుక్‌, లింక్డ్డిన్‌ వంటి సామాజిక మాథ్యమాలపై ఆన్‌లైన్‌లో ఈ అథ్యయనం చేపట్టామని సీఎంఈఈ వెల్లడించింది.

మరిన్ని వార్తలు