అది.. డైనోసార్లను భయపెట్టింది..!

31 Oct, 2017 13:08 IST|Sakshi

భారత దేశంలో అంతరిం‍చిపోయిన డైనోసార్లు తిరుగాడాయా? ఇక్కడే రాక్షసబల్లులు.. స్వేచ్ఛగా విహరించాయా? లక్షల సంవత్సరాల కిం‍దటే పురాతన జంతువులు భారత్‌లో.. ఆవాసమేర్పరచుకున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది.

150 మిలియన్‌ ఏళ్ల చరిత్ర.. 1500 గంటల పురాతత్వ అధికారుల ప్రయత్నాలు సఫలమ్యాయి. గుజరాత్‌లోని లోడాయి ప్రాంతంలో డైనోసార్లు.. వాటికంటే పూర్వపు జం‍తువులు సంచరించాయన్న నమ్మకంతో శిలాజాలపై పరిశోధనలు చేసే అధికారులు, భారత పురాతత్వ శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తవ్వకాల్లో భారీ సముద్ర సరీసృప శిలాజాల వెలుగు చూశాయి. ఈ శిలాజం 5  మీటర్లు పొడవు.. ఉంది. ఆధునిక తిమింగలాలు, డాల్ఫిన్లకు మాతృకలా ఇది కనిపించడం విశేషం.

పొడవైన తోక, నాలుగు రెక్కలు కలిగిన ఈ సముద్ర జంతువు.. 152 నుంచి 157 మిలియన్‌ సంవత్సరా మధ్య జీవించి ఉండొచ్చని శిలాజ నిపుణులు అంచనా వేస్తున్నారు. డైనోసార్లు, ఇటువంటి సముద్ర సరీసృపాల మధ్య అప్పట్లో భీకరమైన పోరాటాలు జరిగి ఉండొచ్చని వారు అంటున్నారు. ఒక దశలో డైనాసర్లును సైతం ఇవి భయపెట్టి ఉంటాయని అంచనా వేస్తున్నారు.

డైనోసార్లను సైతం భయపెట్టే ఈ సముద్ర జం‍తువులు అప్పట్లో ప్రపంచమంతా ఎలా విస్తరించాయో తెలుసుకునేందుకు ఈ శిలాజాలు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. సముద్ర జంతువుల శిలాజాలను గుర్తించే క్రమంలో యూనివర్సిటీ ఆఫ్‌ ఎడిన్‌ బర్గ్‌కు చెందిన స్టీవ్‌ బ్రుస్టే కృషి వల్లే ఇది బయట పడిందని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు