పూరి తీరంలో సైకత అద్భుతం!

30 Apr, 2018 11:48 IST|Sakshi
పూరి తీరంలో సుదర్శన్‌ పట్నాయక్‌ తయారు చేసిన బుద్ధుని సైకత శిల్పం

సాక్షి, న్యూఢిల్లీ : బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ భువనేశ్వర్‌లోని పూరి తీరంలో ఇసుకతో బుద్ధుని ప్రతిమను తయారు చేశారు. ‘ప్రపంచ శాంతిని కోరుతూ బోది చెట్టు కింద ప్రార్థన చేస్తున్న బుద్ధుడు’  సైకత శిల్పం ఫోటోలను పట్నాయక్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. బుద్ధుని ఆశిస్సులతో ప్రపంచమంతా శాంతితో నిండిపోవాలని కాంక్షించారు.

‘అందరికీ హృదయపూర్వక బుద్ధపూర్ణిమ శుభాకాంక్షలు’ అంటూ పట్నాయక్‌ బుద్ధ జయంతి సందర్భంగా గతంలో బెర్లిన్‌, జపాన్‌ సముద్ర తీరాల్లో తయారు చేసిన బుద్ధుని మంచు ప్రతిమ ఫోటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.  వైశాఖ పూర్ణిమ రోజున జన్మించిన సిద్ధార్థుడు తన బోధనలతో, చేతలతో..  మనిషి దుఃఖానికి కారణమైన కోరికలను త్యజించి శాంతియుత జీవనాన్ని గడపాలని చాటిచెప్పారు. కాగా, బుద్ధుని జన్మదినం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా బౌద్ధ మతస్తులు ప్రార్థనలు, పూజలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు