ప్రత్యూషది ఆత్మహత్య కాదు హత్యే

2 Apr, 2016 11:51 IST|Sakshi
ప్రత్యూషది ఆత్మహత్య కాదు హత్యే

ముంబై: ప్రముఖ  టీవీ నటి ప్రత్యూష బెనర్జీ(24)  మరణంపై  పలు  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావిస్తున్నా.. సన్నిహితులు మాత్రం అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమె  ఆత్మహత్యా చేసుకుందా లేక హత్యా అనేది విచారణలో తేలాల్సివుంది.

ప్రత్యూష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని సహనటి పాల్ డాలీ బింద్రా  బింద్రా చెప్పారు.   బిగ్ బాస్ లో ప్రత్యూష తో  కలిసి నటించిన అజీజ్ ఖాన్ మాట్లాడుతూ ఇది కచ్చితంగా ప్రీ పాన్డ్ మర్డర్ అయి వుంటుందనే అభిప్రాయాన్ని  వ్యక్తం చేశారు. ప్రత్యూష మృతదేహంపై  మెడ, ఎడమ చెంపపై గాయాలు ఉండటం, నోటినుంచి రక్త రావడంతో ప్రత్యూషది  హత్య అని సన్నిహితులు భావిస్తున్నారు. ఆమె హత్యకు గురైందనే బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఆమె మృతదేహంపై గాయాలు ఉండటం,  సూసైడ్ నోట్ లభించకపోవడం , ప్రియుడు రాజ్ సింగ్ పరారీలో ఉండడంతో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.  

ఆమెది హత్యా లేక ఆత్మహత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.  పోస్ట్ మార్టం నివేదిక   అనంతరం   మరికొన్ని వివరాలు బహిర్గతమయ్యే అవకాశం ఉంది.


మరోవైపు  ప్రత్యూష బాయ్ఫ్రెండ్ రాహుల్ రాజ్సింగ్, ఆమె చనిపోయినపుడు ఆసుపత్రిలో ప్రశాంతంగా కనిపించడం, ప్రత్యూష తల్లిదండ్రులకు  విమాన టికెట్లు బుక్ చేయడంపై సన్నిహితులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి పెళ్లికూతురు ఆనందిగా తెలుగు టీవీ ప్రేక్షకులను ఆకట్టుకున్న  ప్రత్యూష  ముంబై శివార్లలోని సొంత ఫ్లాట్‌లో అనుమానాస్పదంగా మరణించిన సంగతి తెలిసిందే.

 

మరిన్ని వార్తలు