మండిపడ్డ మహిళా దర్శకురాలు

19 Oct, 2017 18:34 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటక విధానసౌధ వజ్రోత్సవాల సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న ఆడంబర ఖర్చుపై విమర్శల వెల్లువ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ విషయంపై సినీ దర్శకురాలు సుమనా కిత్తూరు కూడా స్పందించారు. కేవలం మూడు షార్ట్‌ ఫిల్మ్స్‌ నిర్మించేందుకు నాలుగు కోట్ల రూపాయల ఖర్చు ఎందుకవుతోందంటూ సుమనా కిత్తూరు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాము సినిమాలు నిర్మించినా కూడా ఇంత ఖర్చు చేయమని, అలాంటిది కేవలం మూడు లఘుచిత్రాలకే కోట్ల రూపాయలను ఖర్చు చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు.

ప్రస్తుతం సుమనా కిత్తూరు వేసిన ప్రశ్నలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. చాలా మంది నెటిజన్‌లు ఆమె వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ పోస్టింగ్‌లను పెడుతున్నారు. శాండర్‌వుడ్‌లో కొద్దిమంది మహిళా డైరెక్టర్లలో ఒకరైన సుమన 2008లో స్లమ్‌ బాల సినిమా ద్వారా దర్శకురాలిగా మారారు. కళ్లారా సంతే, ఎదగారికె సినిమాలు తెరకెక్కించారు. ఈ రెండు సినిమాలకు కర్ణాటక ప్రభుత్వ పురస్కారాలు అందుకున్నారు.

మరిన్ని వార్తలు