పల్లె విద్యార్థులకు ఆనంద్‌ కుమార్‌ పాఠాలు

28 May, 2020 06:31 IST|Sakshi

న్యూఢిల్లీ: ‘సూపర్‌–30’ కోచింగ్‌తో ఫేమస్‌ అయిన ఆనంద్‌ కుమార్‌ పల్లెటూర్లకు చెందిన పేద విద్యార్థుల కోసం ఒక్క రూపాయికే కోచింగ్‌ అందించే ప్రాజెక్టులో పాలుపంచుకున్నారని ఈ గవర్నెన్స్‌ బుధవారం తెలిపింది. ప్రజలకు సుపరిచితుడైన ఆనంద్‌ కుమార్‌ ఆన్‌లైన్‌లో విద్యార్థులకు ట్రైనింగ్‌ ఇచ్చే మాడ్యూల్‌కు కోర్సును తయారు చేయనున్నారు. ఇది ఐఐటీ జేఈఈ పరీక్షలు రాసే విద్యార్థులకు ఉపయోగపడనుంది. ఇది పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, సైన్సు, లెక్కలు విద్యార్థులు పట్టు సాధించేలా ఉంటుందని ఆనంద్‌ చెప్పారు. ఒక్క రూపాయికే పేద విద్యార్థులకు అందుబాటులో ఉంటుందన్నారు. కొత్త రకమైన బోధనా పద్ధతులతో విద్యార్థులు  నేర్చుకునేలా, సబ్జెక్టులపై ఆసక్తి పెంచేలా ఉంటుందన్నారు.

మరిన్ని వార్తలు