అయోధ్య కేసు : మధ్యవర్తితత్వానికి సుప్రీం గ్రీన్‌ సిగ్నల్‌

8 Mar, 2019 10:59 IST|Sakshi

న్యూఢిల్లీ : అయోధ్య వివాద పరిష్కారం మధ్యవర్తిత్వంతోనే సాధ్యమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మధ్యవర్తిత్వం నెరపడానికి ముగ్గురితో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్‌లో జస్టిస్ ఖలీఫుల్లా, రవిశంకర్‌ ప్రసాద్‌, శ్రీ రామ్ పంచ్‌ల పేర్లను సూచించింది. మధ్యవర్తితత్వాన్ని ప్రారంభించడానికి ఒక వారం, 4 వారాల్లో స్టేటస్‌ రిపోర్ట్‌, 8 వారాల్లో మధ్యవర్తిత్వం పూర్తి చేయాలని ప్యానెల్‌ను ఆదేశించింది. మొత్తం మధ్యవర్తిత్వ ప్రక్రియలో పూర్తి గోప్యత పాటించాలని, ఫైజాబాద్‌ కేంద్రంగా మధ్యవర్తితత్వం చేయాలని సూచించింది. బుధవారం మధ్యవర్తికి అప్పగించే విషయంలో సుప్రీంకోర్టు తీర్పును రిజర్వులో ఉంచిన విషయం తెలిసిందే. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం కేవలం భూమికి సంబంధించింది కాదని, వివిధ వర్గాల ప్రజల మనోభావాలు, మత విశ్వాలతో కూడుకున్నదని ఈ సందర్భంగా సుప్రీం వ్యాఖ్యానించింది. 

ఇక అయోధ్యలోని 2.7 ఎకరాల వివాదస్పద భూమిపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తుండగా.. రామ్‌లల్లా, నిర్మోహ అఖోడా, సున్నీ వక్ఫ్‌ బోర్డు మధ్య ఈ వివాదం నడుస్తోంది. తాజాగా ఈ వివాదాన్ని మధ్యవర్తిత్వ ప్యానెల్‌కు అప్పజెప్పడంతో ఈ 2.7 ఎకరాలు ఎవరికి చెందుతుందో ఈ ప్యానెల్‌ తేల్చనుంది. ఇక అయోధ్యలో 67. 7 ఎకరాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా 1993లో స్టే విధించారు. 2010లో 2.77 ఎకరాల భూమిని అలహాబాద్‌ కోర్ట్‌ ముగ్గురికి పంచింది. ఈ తీర్పుపైనే ప్రస్తుతం సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది.

మరిన్ని వార్తలు