కేవీల్లో ప్రార్థనా గీతం తప్పనిసరా?

11 Jan, 2018 01:21 IST|Sakshi

కేంద్రం వివరణ అడిగిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: కేంద్రీయ విద్యాలయా(కేవీ)ల్లో ఉదయం అసెంబ్లీలో విద్యార్థులు తప్పని సరిగా ప్రార్థనా గీతం పాడటంపై కేంద్రం వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశిం చింది. కేవీల్లో ప్రార్థనాగీతం ఆలపించాలన్న కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో మధ్యప్రదేశ్‌కు చెందిన వినాయక్‌ సిన్హా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారీమన్, జస్టిస్‌ నవీన్‌ సిన్హాల ధర్మాసనం బుధవారం విచారించింది.

దేశ వ్యాప్తంగా ఉన్న కేవీల్లో హిందూ మతానికి చెందిన ఓ ప్రార్థనా గీతాన్ని విద్యార్థులు తప్ప నిసరిగా ఆలపించాలంటూ కేంద్రం బలవం తపు ఆదేశాలు జారీ చేసిందని.. దానివల్ల విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందడం కష్టమని పిటిషనర్‌ వాదించారు.

మరిన్ని వార్తలు