కట్నం వేధింపులపై సుప్రీం తీర్పు సవరణ

15 Sep, 2018 05:19 IST|Sakshi

న్యూఢిల్లీ: వరకట్నం వేధింపుల కేసులో భర్త, అతని కుటుంబ సభ్యులను వెంటనే అరెస్ట్‌ చేయకుండా గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తాజాగా సవరించింది. తాము గతంలో ఇచ్చి తీర్పు చట్టాలకు లోబడి లేదని సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. క్రిమినల్‌ కేసుల్లో ఇరుపక్షాలు రాజీకి వచ్చినా కేసును కొట్టేసే అధికారం కేవలం హైకోర్టులకు మాత్రమే ఉంటుందని తేల్చిచెప్పింది. మరోవైపు కుష్టు వ్యాధిగ్రస్తులు రిజర్వేషన్, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేలా దివ్యాంగుల చట్టం–2016లో నిబంధనలు సవరించే అంశాన్ని పరిశీలించాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. 

మరిన్ని వార్తలు