‘పీఎం మోదీ’పై పునరాలోచించండి

16 Apr, 2019 08:11 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ జీవిత కథ ఆధారంగా తీసిన ‘పీఎం నరేంద్ర మోదీ’ సినిమా పై నిషేధం నిర్ణయాన్ని వాస్తవ పరిస్థితుల ఆధారంగా మరోసారి పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని (ఈసీ)సుప్రీంకోర్టు కోరింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా ‘పీఎం నరేంద్ర మోదీ’ ద్వారా ఓటర్లను ప్రభావితం చేసేందుకు అధికార బీజేపీ యత్నిస్తోందంటూ ఈసీకి ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి. దీంతో ఈ నెల 11వ తేదీన దేశవ్యాప్తంగా విడుదల కావాల్సిన ఈ సినిమాపై ఈసీ నిషేధం విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు ఈ నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది. సినిమాలోని ఏ చిత్రం లేదా సన్నివేశాన్ని ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఎలక్ట్రానిక్‌ మీడియాలో ఉంచరాదని కూడా పేర్కొంది. దీనిపై ‘పీఎం నరేంద్ర మోదీ’ నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాల ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. ఎన్నికల సంఘం ‘పీఎం నరేంద్ర మోదీ’ మొత్తం సినిమా కాకుండా కేవలం రెండు నిమిషాల ట్రైలర్‌ను చూసి ఈసీ నిషేధం నిర్ణయం తీసుకుందని పిటిషనర్‌ తరఫు లాయర్‌ ముకుల్‌ రోహిత్గీ తెలిపారు. ఈసీ బృందానికి ఈనెల 16, 17వ తేదీల్లో పూర్తి చిత్రం చూపేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తాము ట్రైలర్‌ మాత్రమే చూసినట్లు ఈసీ కూడా అంగీకరించింది. దీంతో పీఎం మోదీ సినిమాను ఆసాంతం చూసిన తర్వాతే నిషేధించాలో వద్దో నిర్ణయించాలని ధర్మాసనం తెలిపింది. ఈ నెల 19వ తేదీలోగా నిర్ణయం తీసుకుని, సంబంధిత నివేదికను సీల్డు కవర్‌లో సమర్పించాలని ఆదేశించింది. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘అతను పాకిస్తానీ.. నమ్మాల్సిన పని లేదు’

కౌంటింగ్‌లో ఫారం–17సీ కీలకం

టీడీపీలో  టెన్షన్‌...టెన్షన్‌

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం

పంజా విసిరేదెవరు?

గురుదాస్‌పూర్‌ ‘బోర్డర్‌’ వార్‌!

ఎన్నికల ఫలితాలు ప్రతిబింబించే ఎనిమిది సీట్లు!

వందేళ్ల పార్టీ... ఒక్కసారీ నెగ్గలేదు!

ప్రతి మతంలోనూ ఉగ్రవాదులున్నారు

మోదీ షోలే సినిమాలో అస్రానీ: ప్రియాంక

రాహుల్‌ ఓ మూర్ఖుడు: హెగ్డే

ఎన్నికల ప్రచారానికి తెర

ప్రాంతీయ పార్టీలు బీజేపీకి మద్దతివ్వవు

కేంద్రంలో మళ్లీ మేమే

మీడియా ముందుకు మోదీ!

ఏది అప్రజాస్వామికం?

ముగిసిన ప్రచార పర్వం

ఏంటి ‘బాబూ’ షాకయ్యారా..!

ఒకవేళ నరేంద్ర మోదీ ఓడిపోతే...!

‘మోదీ గొప్ప నటుడు’

కౌంటింగ్‌ రోజు భారీ ఉగ్రదాడికి స్కెచ్‌

ప్రభుత్వాన్ని నిర్ణయించేది ప్రాంతీయ పార్టీలే!

మోదీ అప్పుడెందుకు రాలేదు?

‘పూర్తి మెజారిటీతో మళ్లీ వస్తాం’