అలా లోబరుచుకోవడం లైంగిక దాడే : సుప్రీం

15 Apr, 2019 20:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పెళ్లి పేరుతో మహిళను లోబరుచుకోవడం లైంగిక దాడిగా పరిగణించాలని, ఇది మహిళ గౌరవానికి భంగకరమేనని సర్వోన్నత న్యాయస్ధానం సంచలన తీర్పు వెలువరించింది. చత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ డాక్టర్‌ 2013లో్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మహిళ ఆరోపించిన కేసులో జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ ఎంఆర్‌ షాలతో కూడిన సుప్రీం బెంచ్‌ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. నిందితుడైన డాక్టర్‌తో విలాస్‌పూర్‌కు చెందిన బాధితురాలికి  2009 నుంచి పరిచయం ఉంది.

వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుండగా పెళ్లి చేసుకుంటానని నమ్మించిన నిందితుడు బాధితురాలిని వంచిస్తూ మరో మహిళను వివాహం చేసుకున్నాడు. బాధిత మహిళ ఫిర్యాదుతో నిందితుడిని చత్తీస్‌గఢ్‌ హైకోర్టు లైంగిక దాడిలో దోషిగా తేల్చింది. హైకోర్టు నిందితుడికి పదేళ్ల కఠిన శిక్షను విధించడంతో నిందితుడు కింది కోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. కాగా, బాధితురాలిని వివాహం చేసుకునే ఉద్దేశం నిందితుడికి లేకున్నా ఆమెను శారీరకంగా లోబరుచుకునేందుకు పెళ్లిని సాకుగా చూపాడని, ఇది లైంగిక దాడి కిందకే వస్తుందని సుప్రీం బెంచ్‌ స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు అదే నేరం కింద శిక్షను అనుభవించాల్సిందేనని తేల్చిచెప్పింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నదిలో పడిన పెళ్లి వ్యాన్‌ : 7గురు చిన్నారులు గల్లంతు

చిన్నారి ప్రాణం తీసిన వైద్యుల నిర్లక్ష్యం

ప్రభుత్వ నినాదం సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌ : రాష్ట్రపతి

మాజీ మిస్‌ ఇండియాపై దాడి : ఎస్పై సస్పెండ్‌

ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో మైనర్‌ బాలికపై అత్యాచారం

వైరల్‌: కదిలే రైలు ఎక్కబోయి..

వ్యాపారవేత్తను పెళ్లాడిన నటి

దారుణం : వేశ్యలపై 9 మంది సామూహిక అత్యాచారం

టిఫిన్‌బాక్స్‌ గొడవతో విమానం ఆలస్యం

పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హోదా హామీ అమలు కాలేదు 

గుజరాత్‌ ఉపఎన్నికలపై మీ వైఖరేంటి?

మాజీ మిస్‌ ఇండియాకు వేధింపులు

క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ బాంబే, ఢిల్లీ

‘కర్ణాటక కాంగ్రెస్‌’ రద్దు

లోక్‌సభలో నవ్వులు పూయించిన అఠవాలే

రాహుల్‌కు మోదీ జన్మదిన శుభాకాంక్షలు

స్పీకర్‌గా బిర్లా ఏకగ్రీవం

జమిలి ఎన్నికలపై కమిటీ

అఖిలపక్ష సమావేశంలో ‘ప్రత్యేక హోదా’ ప్రస్తావన

జమిలి ఎన్నికలు.. ఆ తర్వాతే తుది నిర్ణయం: రాజ్‌నాథ్‌

కొల్హాపురి చెప్పులకు అరుదైన ఘనత

ఎన్నో పార్టీలు ఎప్పటికీ అంగీకరించవు!

పార్లమెంటులో ఆసక్తికర సన్నివేశం

పార్లమెంటులో నవ్వులు పువ్వులు..!

రాహుల్‌ యోగా చేస్తే..

ఈనాటి ముఖ్యాంశాలు

‘ఆ ఆర్డినెన్స్‌తో వర్సిటీల మూసివేత’

జమిలి ఎన్నికలకు నవీన్‌ పట్నాయక్‌ సమర్ధన

కపిల్‌ ‘లెజెండరీ ఇన్నింగ్స్‌’ను మళ్లీ చూడొచ్చు!!

అఖిలపక్షానికి డుమ్మా.. దానికి వ్యతిరేకమేనా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తాగుబోతుల వీరంగం.. దర్శకుడికి గాయాలు

తమిళ ‘అర్జున్‌ రెడ్డి’ మెప్పిస్తాడా!

‘బేబీ ముసల్ది కాదు.. పడుచు పిల్ల’

రాజుగారి గదిలోకి మూడోసారి!

సమంత.. 70 ఏళ్ళ అనుభవం ఉన్న నటి!

శృతికి జాక్‌పాట్‌