వీడియో కాన్ఫరెన్సింగ్‌

7 Apr, 2020 05:02 IST|Sakshi

విచారణలకు సుప్రీంకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ: కోవిడ్‌ మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలో అత్యవసరమైతే తప్ప  కోర్టులకు రావాల్సిన అవసరం లేదనీ, అన్ని కోర్టులు భౌతిక దూరం పాటిస్తూ వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీచేసింది. టెక్నాలజీని ఉపయోగించుకుని కోర్టుల్లో విచారణ చేపట్టాలని కోరుతూ సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు, సీనియర్‌ న్యాయవాది వికాస్‌ సింగ్‌ రాసిన లేఖను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ ఆదేశాలను జారీచేసింది. న్యాయప్రక్రియ సజావుగా సాకేందుకు ఆధునిక సాంకేతిక తను ఉపయోగించుకుని వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా విచారణ చేపట్టేందుకు దేశంలోని హైకోర్టులన్నింటికీ అనుమతినిస్తూ అత్యున్నత న్యాయస్థానం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది.

>
మరిన్ని వార్తలు