సుప్రీంకోర్టుకు కొత్తగా నలుగురు జడ్జీలు

19 Sep, 2019 04:54 IST|Sakshi

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు కొత్తగా నలుగురు జడ్జీలు నియమితులయ్యారు. దీంతో జడ్జీల సంఖ్య 34కు చేరింది. ఇప్పటివరకూ ఇదే అత్యధిక సంఖ్య. వీరిలో జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ ఎస్‌ఆర్‌ భట్, జస్టిస్‌ వీ రామసుబ్రమణియన్, జస్టిస్‌ హృతికేశ్‌రాయ్‌లు ఉన్నారని న్యాయశాఖ ప్రకటించింది. వీరు సోమవారం ప్రమాణస్వీకారం చేసే వీలుంది. గత నెలలోనే సుప్రీంకోర్టు కొలీజియం వీరి పేర్లను కేంద్రానికి సూచించింది. వీరిలో జస్టిస్‌ రామసుమ్రమణియన్‌ హిమాచల్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గాను, జస్టిస్‌ కృష్ణ మురారి పంజాబ్, హరియాణా హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ఉన్నారు. జస్టిస్‌ ఎస్‌ రవీంద్ర భట్, హృతికేశ్‌ రాయ్‌లు రాజస్తాన్, కేరళ హైకోర్టులకు చీఫ్‌ జస్టిస్‌లుగా పని చేస్తున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30గా ఉండగా కొత్త జడ్జీల ప్రమాణస్వీకారం అనంతరం ఆ సంఖ్య 34కు చేరనుంది. సుప్రీంకోర్టులో 59,331 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని జూలై 11న రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్రం తెలిపింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని న్యాయమూర్తుల సంఖ్య పెంచాల్సిందిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ప్రధాన మంత్రికి లేఖ రాశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బెంగాల్‌ను ‘బంగ్లా’గా మార్చండి

‘విక్రాంత్‌’లో దొంగలు

ఎస్సీ, ఎస్టీ చట్టం తీర్పు రిజర్వ్‌

అయోధ్య వాదనలు 18కల్లా ముగించండి

దేశమంతా ఎన్నార్సీ : అమిత్‌ షా

రైల్వేలో 78 రోజుల బోనస్‌

ఇ–సిగరెట్లపై నిషేధం

ఇస్రో భావోద్వేగ ట్వీట్‌

భారత్‌కు పాక్‌ షాక్‌.. మోదీకి నో ఛాన్స్‌

ఈనాటి ముఖ్యాంశాలు

మోదీ భార్యను కలుసుకున్న మమత

పాఠ్యాంశంగా ట్రిపుల్‌ తలాక్‌

కేవలం 36 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా వైరస్‌!

హిందీ వివాదం.. వెనక్కి తగ్గిన షా

ఆ ఎక్స్‌-రే హాలీవుడ్‌ స్టార్‌ మార్లిన్‌ మన్రోదట..

మోదీకి కుర్తా బహుకరించిన దీదీ

యూకో బ్యాంకు వద్ద భారీ అగ్ని ప్రమాదం

బిగ్‌బీ ! ఈ విషయం మీకు తెలియదా ?

ఒక్కడి కోసం వేల మందిని ముంచుతారా?

ల్యాండర్‌ విక్రమ్‌ కోసం ‘పైకి’ చేరాడు..!!

భక్తులకు రైల్వే శాఖ శుభవార్త ...

ఎలా ఉన్నారు? 

‘సింధూ నాగరికత’ వారసులు తమిళులా!

కేంద్రం కీలక నిర్ణయం: ఈ-సిగరెట్లపై నిషేధం

రైల్వే ఉద్యోగులకు బోనస్‌ బొనాంజా

‘సిట్‌ ఆయనను రక్షించాలని చూస్తోందా?’

ఆ కుటుంబం వల్ల ఊరికి ప్రత్యేక గుర్తింపు

తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిని..

హిందీపై అమిత్‌ షా వర్సెస్‌ రజనీకాంత్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రేమ సంబరాలు

‘ఇలాంటి సినిమాలకు డబ్బులుంటే సరిపోదు’

విఘ్నేష్‌కు నయనతార భారీ కానుక

ఇప్పుడు విలన్‌గా ఎందుకు అన్నారు : వరుణ్‌

ఆస్కార్‌ బరిలో మోతీ భాగ్‌

రైతు పాత్రలో...