అధికారంలో ఎవరున్నా మాకు ఒకటే!: సుప్రీం

13 Aug, 2014 01:42 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వాల మార్పుతో తమకు సంబంధం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘సంబంధిత చట్టం ప్రకారం న్యాయం చేయడమే మా పని’ అని మంగళవారం తేల్చి చెప్పింది. ‘ప్రభుత్వ మార్పును పట్టించుకోం. ఏ ప్రభుత్వం వచ్చింది?, ఏ ప్రభుత్వం పోయింది?  పట్టించుకోం. చట్టాన్ని ఉల్లంఘించే ఎవర్నైనా అడ్డుకుంటాం. గుజరాత్ అల్లర్ల కేసులో ఈ కోర్టు చాలా చేసింది’ అని జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయి, జస్టిస్ ఎన్‌వీ రమణల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎవరైనా సరే చట్టానికి అతీతుడు కాదని పేర్కొంది. ‘తప్పు జరిగి ఉంటుందని కోర్టు నమ్మితే, అది మే తరువాతనా? లేక మే నెల కన్నా ముందా అనే విషయంతో సంబంధం లేకుండానే ముందుకు వెళ్తుంది’ పేర్కొంది. గుజరాత్ ప్రభుత్వం తనను వేధిస్తోందని సస్పెండైన ఐఏఎస్ అధికారి  ప్రదీప్ శర్మ వేసిన పిటిషన్ విచారణలో ఈ వ్యాఖ్యలు చేసింది.

మరిన్ని వార్తలు