సుప్రీంలో త్వరలో పారదర్శక రోస్టర్‌ విధానం

22 Jan, 2018 04:54 IST|Sakshi

న్యూఢిల్లీ: సుప్రీంలో దాఖలయ్యే సున్నితమైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను(పిల్‌) ధర్మాసనాలకు కేటాయించే విషయంలో మరింత పారదర్శతక కోసం అందిన సలహాలను సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా పరిశీలించినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. కేసులకు సంబంధించిన వివరాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించాయి. మరోవైపు సుప్రీం సంక్షోభం నివారణకు సీజేఐతో నలుగురు సీనియర్‌ జడ్జీలు సోమవారం భేటీ అయ్యే అవకాశముందని పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు