పుదుచ్చేరి సీఎంకు సుప్రీం నోటీసులు 

5 Jun, 2019 07:11 IST|Sakshi

కేబినెట్‌ నిర్ణయాలు అమలు చేయొద్దని ఆదేశాలు

న్యూఢిల్లీ: పుదుచ్చేరి సీఎం వి.నారాయణ స్వామికి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్‌జీ) కిరణ్‌ బేడీకి అధికారాల విషయంలో తలెత్తిన వివాదంలో సుప్రీంకోర్టు సీఎంకు నోటీసులు జారీ చేసింది. అలాగే ఈనెల 7న కేబినెట్‌ సమావేశంలో తీసుకోబోయే ఎలాంటి ఆర్థికపరమైన నిర్ణయాలను జూన్‌ 21వరకు అమలు చేయరాదని ఆదేశించింది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ప్రభుత్వ రోజువారీ కార్యకలాపాల్లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ జోక్యం చేసుకోకూడదని మద్రాస్‌ హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పుతో పుదుచ్చేరిలో పాలన స్తంభించిపోయిందని, ఏప్రిల్‌ 30కి ముందున్న పరిస్థితులను పునరుద్ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టులో కేంద్రంతో పాటు కిరణ్‌ బేడీ పిటిషన్‌ దాఖలు చేశారు.

మరిన్ని వార్తలు