ఉరిశిక్షపై సుప్రీంకు వెళ్లడానికి దోషులకు 60 రోజుల గడువు

21 Feb, 2020 03:47 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉరిశిక్ష పడిన దోషులు శిక్ష నుంచి ఉపశమనానికి సుప్రీంకోర్టుకెక్కడానికి 60 రోజులు గడువు ఉన్నప్పటికీ ఈ లోగా వారికి డెత్‌ వారంట్లు ఎందుకు జారీ చేస్తున్నారని సుప్రీంకోర్టు గురువారం ట్రయల్‌ కోర్టులను ప్రశ్నించింది. 2018లో గుజరాత్‌లోని సూరత్‌లో మూడేళ్ల చిన్నారి అత్యాచారం, హత్యకేసులో అనిల్‌ సురేంద్ర సింగ్‌ యాదవ్‌ని ట్రయల్‌ కోర్టు దోషిగా తేల్చింది. ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పుని హైకోర్టు కూడా సమర్థించింది. ఆ తర్వాత కేవలం 33 రోజుల్లోనే కింది కోర్టు డెత్‌ వారంట్లు జారీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ యాదవ్‌ సుప్రీంకోర్టుకెక్కాడు. దీంతో బెంచ్‌ యాదవ్‌ డెత్‌ వారంట్‌పై స్టే విధించింది. హైకోర్టు తీర్పుని సుప్రీంలో సవాల్‌ చేసుకోవడానికి దోషులకు 60 రోజులు గడువు ఉంటుందని, ఈలోగా డెత్‌ వారంట్లు జారీ చేయకూడదని సుప్రీంకోర్టు గతంలో తీర్పిచ్చింది. అలాంటప్పుడు కింది కోర్టులు డెత్‌ వారంట్లు ఎలా జారీ చేస్తారని సుప్రీం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

>
మరిన్ని వార్తలు