జడ్జీల నియామకంలో జాప్యంపై సుప్రీం అసహనం

12 Aug, 2016 21:44 IST|Sakshi
జడ్జీల నియామకంలో జాప్యంపై సుప్రీం అసహనం

న్యూఢిల్లీ: కొలీజియం ఖరారు చేసిన హైకోర్టు జడ్జీల నియామకం, బదిలీల సిఫారసులు అమలుకాకపోవడం పట్ల సుప్రీంకోర్టు ధర్మాసనం  శుక్రవారం అసహనం  వ్యక్తం చేసింది. కొలీజియం ఖరారు చేసిన 75 మంది హైకోర్టు జడ్జీల నియామకంపై ఎందుకు ఉత్తర్వులు ఇవ్వలేదని అటార్నీ జనరల్‌ను ప్రశ్నించింది.

1971 యుద్ధ సమయంలో లెఫ్ట్‌నెంట్ కల్నల్‌గా పనిచేసిన అనిల్ కబోత్రా ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి టీ.ఎస్.ఠాకూర్ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. హైకోర్టుల్లో దాదాపు 43 శాతం జడ్జీల కొరత ఉందని, హైకోర్టుల్లో మొత్తం 40 లక్షల  కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఈ సందర్భంగా ధర్మాసనం తెలిపింది. దీనివల్ల న్యాయవ్యవస్థపై నమ్మకం పోతోందని ఠాకూర్ అన్నారు.

మరిన్ని వార్తలు