అయోధ్యపై రాజ్యాంగ ధర్మాసనం

26 Jan, 2019 04:51 IST|Sakshi

న్యూఢిల్లీ: అయోధ్యలోని రామమందిరం–బాబ్రీమసీదు భూవివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును విచారించేందుకు సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఎస్‌ఏ నజీర్‌లతో ఐదుగురు సభ్యులతో కొత్త రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటుచేసింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనం 2019, జనవరి 29 నుంచి ఈ కేసును విచారించనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అన్ని పక్షాలకు నోటీసులు జారీచేసింది. 2010లో ఈ కేసును విచారించిన అలహాబాద్‌ హైకోర్టు మొత్తం 2.77 ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్‌ బోర్డుకు, నిర్మోహి అఖారాకు, రామ్‌ లల్లాకు సమానంగా పంచాలని తీర్పు వెలువరించడం తెల్సిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు