మరాఠా కోటాపై స్టేకు సుప్రీం నో

12 Jul, 2019 15:23 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్ధల్లో మరాఠాలకు రిజర్వేషన్‌ కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు శుక్రవారం సుప్రీం కోర్టు నిరాకరించింది. మరాఠాలకు కోటాను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై స్పందించాలని సుప్రీం కోర్టు దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఈ పిటిషన్‌పై తాము విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది. మరాఠాలకు రిజర్వేషన్‌లపై మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించిన బాంబే హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

ఈ కేసులో తుది తీర్పుపై కోటాకు సంబందించి మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఆధారపడి ఉంటాయని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా మరాఠాలకు విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో వరుసగా 12, 13 శాతం రిజర్వేషన్‌ను అనుమతించవచ్చని బాంబే హైకోర్టు పేర్కొంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు