సుప్రీంకోర్టులో సీఎంకు ఊరట

6 Apr, 2015 19:34 IST|Sakshi
సుప్రీంకోర్టులో సీఎంకు ఊరట

బొగ్గుక్షేత్రాల కేటాయింపు కేసులో ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనను విచారణకు పిలిపించాలంటూ దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దాంతోపాటు.. పిటిషనర్కు జస్టిస్ వి.గోపాల్ గౌడ, జస్టిస్ సి.నాగప్పన్లతో కూడిన ధర్మాసనం లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది.

పిటిషన్ దాఖలుచేయడానికి అతడికి అర్హత లేదని, అందుకే కోర్టు జరిమానా విధించిందని పిటిషనర్ తరఫు న్యాయవాది సురేష్ త్రిపాఠీ తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్లను సీబీఐ విచారించింది గానీ, పట్నాయక్ను పిలిపించలేదని సాహు తన పిటిషన్లో తెలిపారు. ఆయన లేఖ రాయడం వల్లే కేంద్రం బిర్లాలకు చెందిన హిందాల్కో కంపెనీకి బొగ్గు క్షేత్రాలు కేటాయించిందని అన్నారు. ఈ వాదనను సుప్రీం కొట్టేసింది.

మరిన్ని వార్తలు