వేంనరేందర్ రెడ్డి పిటిషన్ను కొట్టేసిన 'సుప్రీం'

6 Jul, 2015 13:05 IST|Sakshi
వేంనరేందర్ రెడ్డి పిటిషన్ను కొట్టేసిన 'సుప్రీం'

న్యూఢిల్లీ: తెలంగాణ టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టేసింది. తెలంగాణలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కరీంనగర్ జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ అనర్హుడంటూ వేం నరేందర్ రెడ్డి వేసిన పిటిషన్ను తోసిపుచ్చింది.

భారతీయ పౌరుడు కాని చెన్నమనేని రమేష్ పేరును ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాలో చేర్చడం సరికాదని వేంనరేందర్ రెడ్డి తరపు న్యాయవాదులు వాదించారు. కాగా 2014 ఎన్నికల సమయంలో సవాల్ చేయకుండా ఇప్పడు ఓటు హక్కు లేదంటూ రావడమేంటని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరపున వేంనరేందర్ రెడ్డి పోటీచేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల సందర్భంగా ఓటుకు కోట్లు వ్యవహారం వెలుగుచూసింది. వేంనరేందర్ రెడ్డికి ఓటు వేయాల్సిందిగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ముడుపులు ఇస్తూ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.

మరిన్ని వార్తలు