హదియా భర్తతో కలసిఉండొచ్చు: సుప్రీం

9 Mar, 2018 03:11 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘లవ్‌ జిహాద్‌’ కేసులో సుప్రీంకోర్టు గురువారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. కేరళకు చెందిన షఫీన్‌ జహాన్, హదియా అలియాస్‌ అఖిలా అశోకన్‌ల వివాహం చెల్లదంటూ గతేడాది కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 226 ప్రకా రం కేరళ హైకోర్టు ఈ వివాహాన్ని రద్దుచేయకుండా ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. ఇద్దరు మేజర్ల మధ్య జరిగిన వివాహంలో కోర్టులు ఆర్టికల్‌ 226 ప్రకారం జోక్యం చేసుకోలేవనీ, ఆ పెళ్లిని రద్దు చేయలేవని కోర్టు అభిప్రాయపడింది. భర్త షఫీన్‌ జహాన్‌తో కలసి జీవించే పూర్తిస్వేచ్ఛ హదియాకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు