ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో రిజర్వేషన్లు వద్దు : సుప్రీం కోర్ట్‌

26 Sep, 2018 11:13 IST|Sakshi

న్యూఢిల్లీ : ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు అవసరం లేదంటూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రమోషన్‌లలో​ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల రిజర్వేషన్‌ కోటా ప్రయోజనాలు  పొందేందుకు కొన్ని షరతులు విధిస్తూ 2006(నాగరాజు కేసులో) వచ్చిన తీర్పుపై పునఃసమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారిస్తూ ఈ సంచలన తీర్పు ప్రకటించింది. ఈ సందర్భంగా నాగరాజు కేసులో ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాల్సిన అవసరం లేదంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతుల విషయంలో రిజర్వేషన్లు పాటించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ సందర్భంగా ఈ అంశాన్ని ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేయడం కుదరదని ప్రకటించింది.

ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల రిజర్వేషన్‌ కోటాపై ప్రయోజనాలు పొందేందుకు కొన్ని షరతులు విధిస్తూ 2006లో ఎమ్‌ నాగరాజు కేసులో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును పునఃపరిశీలించాలని దాఖలైన పిటిషన్లపై  సీజేఐ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన  రాజ్యాంగ ధర్మాసనం బుధవారం ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల కోసం డేటా సేకరించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది

మరిన్ని వార్తలు