‘సుప్రీం’లో తెలంగాణ సర్కారుకు చుక్కెదురు

7 Dec, 2018 13:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 67 శాతం ఇవ్వాలన్న తెలంగాణ సర్కారు విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దని స్పష్టం చేసింది. తెలంగాణలో బీసీల జనాభా అధికంగా ఉన్నందున రిజర్వేషన్లు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే అటువంటి మినహాయింపులు ఉండబోవని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.

కాగా, ఎస్టీ, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ల అమలు కోసం పోరాటం చేస్తామని టీఆర్‌ఎస్‌ తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీయిచ్చింది. ఈ అంశంపై తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని గుర్తు చేసింది.

మరిన్ని వార్తలు