చౌకీదార్‌ చోర్‌ వ్యాఖ్యలపై రాహుల్‌ని హెచ్చరించిన కోర్టు

30 Apr, 2019 16:23 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ‘చౌకీదార్‌ చోర్‌’ వ్యాఖ్యలపై సుప్రీం కోర్టుకు క్షమాపణలు తెలిపారు. తన వ్యాఖ్యలను కోర్టుకు ఆపాదించడం తప్పేనని.. ఇందుకు రాహుల్‌ బాధపడుతున్నట్లు ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ మంగళవారం కోర్టుకు తెలిపారు. దీన్ని బట్టి రాహుల్‌, కోర్టును క్షమాపణ కోరినట్లే అని అర్థ చేసుకోవాలంటూ అభిషేక్‌ సింఘ్వీ కోర్టుకు నివేదించారు. గతంలో రాహుల్‌ గాంధీ.. రాఫెల్‌ కుంభకోణంలో ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ చౌకీదార్‌ చోర్‌ అని కోర్టే చెప్పిందంటూ.. తన వ్యాఖ్యలను సుప్రీం కోర్టుకు ఆపాదించిన సంగతి తెలిసిందే.

అయితే రాహుల్‌ గాంధీ సుప్రీం కోర్టు వ్యాఖ్యలను వక్రీకరించారంటూ బీజేపీ ఎంపీ మీనాక్షి రాహుల్‌ గాంధీపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా రాఫెల్‌ డీల్‌ కేసులో చౌకీదార్‌ చోర్‌ అనే వ్యాఖ్యానం తాను ఎప్పుడు చేయలేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మేము అని మాటలను మాకేలా ఆపాదిస్తారని కోర్టు రాహుల్‌ని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది.

ఈ నేపథ్యంలో ఈ నెల 22న రాహుల్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. దానిలో సదరు వ్యాఖ్యలపై ‘చింతిస్తున్న’ అని తెలిపారు. అయితే ‘చింతిస్తున్న’ అనే పదాన్ని బ్రాకెట్లో ఎందుకు చేర్చారని కోర్టు రాహుల్‌ని ప్రశ్నించింది. దీనిపై కోర్టు ధిక్కారం కింద చర్యలు చేపడతామని రాహుల్ గాంధీని కోర్టు హెచ్చరించింది.

మరిన్ని వార్తలు