ఢిల్లీ కాలుష్యంపై సీరియస్‌ అయిన సుప్రీంకోర్టు

13 Nov, 2019 12:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాజధానిలో వాయు కాలుష్యం పెరగడంపై భారత అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. బుధవారం ఢిల్లీ వాయు కాలుష్యంపై వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌.. హైడ్రోజన్‌ ఇంధన ఆధారత వాహానాల టెక్నాలజీని ఉపయోగించాలని ఆదేశించారు. అంతేగాక వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ అంశంపై డిసెంబర్‌ 3 నాటికి నివేదిక ఇ‍వ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కాగా ఢిల్లీలో విపరీతంగా పెరిగిన వాయు కాలుష్యంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు