టీటీడీపై పిటిషన్‌; హైకోర్టును ఆశ్రయించండి

17 Sep, 2018 12:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) వివాదంపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. టీటీడీ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులును తొలగించడం మొదలుకుని శ్రీవారి నగలు, ఇతరత్రా విషయాల్లో చోటుచేసుకుంటున్న అంశాలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో ఆయన వీటిపై సీబీఐ విచారణ చేపట్టాలని సుప్రీంను ఆశ్రయించారు. సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్‌కు సూచించింది.

కాగా, కోర్టు తీర్పుపై సుబ్రహ్మణ్యస్వామి ట్విటర్‌లో స్పందించారు. ‘తిరుపతి విషయంలో నేను దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇప్పుడు నేను హైకోర్టును ఆశ్రయిస్తాను. ఇది ఒక మంచి ప్రారంభం’ అని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు