కోయంబత్తూర్‌ రేప్‌ దోషికి ఉరే సరి

8 Nov, 2019 04:00 IST|Sakshi

రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

సాక్షి ప్రతినిధి, చెన్నై/న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన కోయంబత్తూరు గ్యాంగ్‌ రేప్‌ ఘటనలో దోషిగా తేలిన మనోహరన్‌కు మరణ శిక్షే సరైన శిక్ష అని గురువారం సుప్రీంకోర్టు పునః నిర్ధారించింది. ఈ మేరకు ఆగస్ట్‌ 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. కోయంబత్తూర్‌లో 2010 అక్టోబర్‌ 29న పాఠశాలకు వెళ్తున్న పదేళ్ల బాలికను, ఏడేళ్ల ఆమె తమ్ముడిని మనోహరన్, మోహన కృష్ణన్‌ అనే ఇద్దరు బలవంతంగా ఎత్తుకెళ్లారు. పిల్లలిద్దరి చేతులు కట్టేసి, ఆ బాలికపై అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. అనంతరం వారికి విషమిచ్చి చంపే ప్రయత్నం చేశారు. విష ప్రభావంతో కూడా ఆ చిన్నారులు చనిపోకపోవడంతో.. వారిని చేతులు, కాళ్లు కట్టేసి పరంబికులం–అక్సియార్‌ ప్రాజెక్టు కాలువలో పడేసి ప్రాణాలు తీశారు.

ఆ తరువాత పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మోహన కృష్ణణ్‌ హతమయ్యాడు. మనోహరన్‌కు ట్రయల్‌ కోర్టు ఉరిశిక్ష విధించింది. హైకోర్టు ఆ తీర్పును సమర్ధించింది. ఈ ఆగస్ట్‌లో సుప్రీంకోర్టు సైతం వారికి ఉరే సరైన శిక్ష అని స్పష్టం చేసింది. అత్యంత అరుదైన దారుణంగా ఆ ఘాతుకాన్ని అభివర్ణించింది. అనంతరం మనోహరన్‌ రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసుకున్నాడు. ఆ రివ్యూ పిటిషన్‌పై  విచారణ జరిపిన జస్టిస్‌ నారిమన్, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా గత తీర్పును సమర్ధిస్తూ రివ్యూ పిటిషన్‌ను 2:1 తేడాతో తోసిపుచ్చారు. మరణ శిక్షను ఇద్దరు న్యాయమూర్తులు సమర్ధించగా, జస్టిస్‌ ఖన్నా మాత్రం చనిపోయేంత వరకు కఠిన కారాగార శిక్ష విధించడం సరైన శిక్ష అవుతుందని అభిప్రాయపడ్డారు. మెజారిటీ జడ్జీల తీర్పు మేరకు మనోహరన్‌కు ఉరిశిక్ష ఖాయమైంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హామీ ఇస్తే ‘ఆర్‌సెప్‌’పై ఆలోచిస్తాం

అయోధ్యలో నిశ్శబ్దం

దారి తప్పిన ‘సెల్ఫ్‌ డ్రైవింగ్‌ టెస్లా’ కారు!

ఈనాటి ముఖ్యాంశాలు

వైరల్‌: నడిరోడ్డుపై ఎద్దు బీభత్సం

అయోధ్య తీర్పు: దేశ వ్యాప్తంగా హైఅలర్ట్‌

ధర్మశాలలో మోదీ.. అభివృద్ధిపై ప్రశంసలు

వీడని ప్రతిష్టంభన: బీజేపీకి సేన సవాల్‌!

మహిళల ప్రాతినిధ్యం అంతంతమాత్రమే..!

ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆర్డర్‌ చేయండి!

‘మాస్క్‌’లు కాలుష్యాన్ని ఆపుతాయా!?

ఎంపీ సంజయ్‌పై దాడి.. స్పీకర్‌ కీలక ఆదేశాలు

ఆ రైల్లో ఇక అర లీటరు బాటిళ్లే

కోయంబత్తూర్‌ హత్యాచారం : మరణ శిక్షకే సుప్రీం మొగ్గు

‘అలాగైతే ఆవులపై గోల్డ్‌ లోన్‌’

దేవతలు మాస్క్‌లు ధరించారు!

పర్యాటకులు పన్ను చెల్లించక్కర్లేదు

హనీప్రీత్‌కు బెయిల్‌

సిద్ధూకు పాక్‌ వీసా మంజూరు

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. జవాన్‌ మృతి

కర్తార్‌పూర్‌ వీడియోలో ఖలిస్తాన్‌ నేతలు?

పావగడ కోర్టుకు గద్దర్‌

14న సెల్‌ఫోన్స్‌ స్విచాఫ్‌ చేయండి!

అయోధ్యపై అనవసర వ్యాఖ్యలొద్దు: ప్రధాని

ప్రజల ప్రాణాలతో చెలగాటమా?

పాత కూటమి... కొత్త సీఎం?

బాలభారతాన్ని కబళిస్తున్న కేన్సర్‌

ఆమె జీతం రూ. 5.04 కోట్లు కాదు.. రూ. 42 లక్షలే

ఈనాటి ముఖ్యాంశాలు

 మీకు అధికారంలో ఉండే హక్కులేదు - సుప్రీం ఫైర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

షూట్‌ షురూ

తీన్‌మార్‌?

మహేశ్‌ మేనల్లుడు హీరో

అరుణాచలం దర్బార్‌

యాక్టర్‌ అయినంత మాత్రాన విమర్శిస్తారా?

రాజీపడని రాజా