దొంగ బాబాల ఆశ్రమాల పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ

8 Jul, 2020 16:19 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  దేశంలోని దొంగ బాబాల ఆశ్రమాలపై వేసిన పిటిషన్‌పై‌ బుధవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దేశంలో అక్రమ డబ్బుతో బోగస్ ఆశ్రమాలు నడుస్తున్నాయని హైదరాబాద్‌కు చెందిన దుంపల రాంరెడ్డి ఆశారమ్‌ బాపు సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన వియం తెలిసింది. ఈ సందర్భంగా 17 ఆశ్రమాలలో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని.. దేశంలో బోగస్ బాబాలు నిర్వహిస్తున్న బోగస్ ఆశ్రమాలపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో రెండు వారాల్లో  తెలపాలని సొలిసిటర్ జనరల్‌ను కోర్టు ఆదేశించింది. వీరేంద్ర దీక్షిత్ వంటి వివిధ బాబాలు నడుపుతున్న 17 ఆశ్రమాలను అఖిల భారత అఖాదా పరిషత్ బోగస్ ఆశ్రమాలుగా ప్రకటించాలని, వాటిపై నియంత్రణ ఉండాలని ఆశారమ్‌ పటిషన్‌లో పేర్కొన్నారు.

అత్యాచార కేసుల్లో నిందితుడు వీరేంద్ర దీక్షిత్ స్థాపించిన ఢిల్లీ రోహిణిలోని ఆధ్యాత్మిక విద్యాలయంలో తన కుమార్తె సంతోషి చిక్కుకున్నట్లు ఆయన కోర్టుకు తెలిపారు. అత్యాచార కేసులో నిందితుడైన వీరేంద్ర దీక్షిత్ 3 సంవత్సరాలు పరారీలో ఉన్నప్పటికీ ఆయన ఆశ్రమం యథావిధిగా నడుస్తుందని పిటినర్‌ కోర్టుకు తెలిపారు. దొంగ బాబాల ఆశ్రమాలలో పరిశుభ్రమైన పరిస్థితులు లేవని, జైళ్లను తలపించేలా ఉన్నాయని ఆశారమ్ పిటిషన్‌లో‌ పేర్కొన్నారు. పిటిషనర్ లేవనెత్తిన సమస్య నిజమైనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ఆశ్రమాలు నియంత్రణ లేకుండా నడుస్తున్నాయని, అనేక చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 

మరిన్ని వార్తలు