పదేళ్ల బాలిక అబార్షన్‌కు సుప్రీం నో

29 Jul, 2017 02:26 IST|Sakshi

న్యూఢిల్లీ: పదేళ్ల అత్యాచార బాధితురాలికి అబార్షన్‌కు అనుమతి ఇచ్చేందుకు శుక్రవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. బాలిక ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా గర్భస్రావానికి అంగీకరించబోమని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. అత్యాచారానికి గురైన మైనర్‌ బాలిక 32 వారాల గర్భాన్ని తొలగించేందుకు ఆదేశాలు ఇవ్వాలంటూ చండీగఢ్‌ జిల్లా కోర్టులో అడ్వకేట్‌ శ్రీవాస్తవ పిల్‌ వేశారు.

దీన్ని చండీగఢ్‌ కోర్టు తోసిపుచ్చడంతో పిటిషనర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అబార్షన్‌తో బాలికకు కలిగే ఇబ్బందులను పరిశీలించాల్సిందిగా చండీగఢ్‌లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(పీజీఐఎంఈఆర్‌)ను కోర్టు ఆదేశించింది. పీజీఐఎంఈఆర్‌ దీనిపై ఒక మెడికల్‌ బోర్టును ఏర్పాటు చేసింది. బాలికను పరిశీలించిన మెడికల్‌ బోర్డు 32 వారాల గర్భాన్ని తొలగించడం బాలిక ఆరోగ్యానికి మంచిది కాదని నివేదించింది. దీంతో కోర్టు పిటిషన్‌ను కొట్టేసింది.

మరిన్ని వార్తలు