సుప్రియా సూలే భావోద్వేగ పోస్టు

28 Nov, 2019 16:20 IST|Sakshi

ముంబై : మరికొద్ది గంటల్లో మహారాష్ట్రలో ‘మహా వికాస్‌ అఘాడి’ కూటమి ప్రభుత్వం కొలువు తీరనుంది. గత వారం రోజులుగా ‘మహా’ రాజకీయంలో ఎన్నో మలుపులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో  ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్, ఆయన కుమార్తె సుప్రియా సూలే, శివసేన నేత సంజయ్‌ రౌత్‌, చాకచాక్యంగా పావులు కదిపి కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. దీంతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థిగా ఉద్దవ్‌ ఠాక్రే గురువారం సాయంత్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

ఈ సందర్భంగా సుప్రియా సూలే ట్విటర్‌లో భావోద్వేగంతో కూడిన సందేశాన్ని ఉంచారు. ఉద్దవ్‌ ఠాక్రే తల్లిదండ్రులైన బాల్‌ ఠాక్రే, మీనాతాయ్‌ ఠాక్రే(మా సాహెబ్‌) లతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. వారు ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయినా.. ఈ రోజు మాత్రం ఇక్కడే ఉంటారని అన్నారు. బాలా సాహెబ్‌, మా సాహెబ్‌లు తనను ఎంతో ప్రేమగా చూసుకునేవారని ఆమె తెలిపారు. నా జీవితంలో వారి పాత్ర ఎంతో ప్రత్యేకమైనదని.. వారి జ్ఞాపకాలు ఎప్పుడూ గుర్తుండిపోతాయని తెలిపారు. కాగా, మొన్నటివరకు పవార్‌, ఠాక్రే కుటుంబాలు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ.. వారి కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు