పెద్దల అనుమతి లేకుండా ప్రేమ వివాహం చేసుకోము

13 Feb, 2019 11:37 IST|Sakshi

గాంధీనగర్‌ : గురువారం ప్రేమికుల రోజు. ప్రేమించిన వారికి మనసులో మాట చెప్పడానికి ఉవ్విళ్లూరే వారు ఓ పక్క.. జంటగా కనిపిస్తే చాలు పెళ్లి చేస్తామని బెదిరించే గుంపులు మరోపక్క. ప్రేమికుల రోజున సర్వసాధరణంగా కనిపించే దృశ్యాలు ఇవి. కానీ వీటన్నింటికి భిన్నమైన ప్రదర్శన ఒకటి సూరత్‌లో జరగనుంది. దాదాపు 10 వేల మంది విద్యార్థుల చేత ‘పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకోము’ అని ప్రమాణం చేయించే కార్యక్రమం ఒకటి జరగనుంది. హస్యమేవ జయతే అనే స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.

సంస్థ సభ్యుడొకరు దీని గురించి మాట్లాడుతూ.. ‘ప్రేమించడం, పెద్దలను ఎదిరించడం, పారిపోయి పెళ్లి చేసుకోవడం ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయాయి. పెళ్లి చేసుకున్న వారు సంతోషంగా ఉంటే ఏ సమస్య లేదు. కానీ కొందరు పెళ్లైన ఆర్నెల్లలోపే విడాకుల తీసుకుంటున్నారు. లేదంటే ఎదిరించి చేసుకున్నందుకు పెద్దలే వారి మీద దాడి చేయడం వంటి సంఘటనలను నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే విద్యార్థుల చేత ‘తల్లిదండ్రుల అనుమతి లేకుండా ప్రేమ వివాహం చేసుకోమ’ని ప్రతిజ్ఞ చేయిస్తున్నాం. 12 పాఠశాలల నుంచి దాదాపు 10 వేలకు పైగా విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు