‘చంద్రయాన్‌’ పై ప్రేమతో ఓ యువతి..

1 Oct, 2019 10:14 IST|Sakshi

సూరత్‌ : దేశవ్యాప్తంగా విజయదశమి పండుగ సంబరాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బతుకమ్మ, దేవీ నవరాత్రుల ఉత్సవాలతో సందడి వాతావరణం మొదలైంది.   చూడముచ్చటగా తీర్చిదిద్దిన మండపాల్లో అమ్మవారి ప్రతిమలను ప్రతిష్టించి భక్తులు నవరాత్రి పూజలు జరుపుకుంటున్నారు. పిండి వంటలు, భజనలు, పూజలుతో  పండుగ జరుపుకుంటుంటే.. గుజరాత్‌ యువతులు మాత్రం ఈ నవరాత్రుల్ని కాస్త వింతగా జరుపుకుంటున్నారు. దేశ భక్తి  పరిమళించేలా శరీరాలపై టాటూలను వేయించుకుంటున్నారు. 

వివరాలు.. సూరత్ లోని మహిళలంతా పండుగ సందర్భంగా అక్కడి మహిళలంతా టాటూలు వేసుకుంటున్నారు. ఒకరేమో చంద్రయాన్ 2 అని వేసుకుంటే, ఇంకొకరేమో మరో మహిళ జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తూ.. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్ 370 ను రద్దు నిర్ణయాన్ని టాటూగా వేయించుకుంది. మరొకరేమో ఫాలో ట్రాఫిక్ రూల్స్ అంటూ.. ఈ మధ్యనే అమలైన ట్రాఫిక్ నిబంధనలను పచ్చబొట్టు వేయించుకుంటున్నారు. ప్రజలకు ఉపయోగపడే ఏ పని చేసినా తప్పు లేదని ఆ యువతులు చెబుతున్నారు. ప్రస్తుతం వీరు వేయించుకున్న టాటూ ఫోటోలు వైరల్‌గా మారాయి.

మరిన్ని వార్తలు