'ఆప్' నేతకు తాజ్ ఆహ్వానం

27 Nov, 2015 14:02 IST|Sakshi
'ఆప్' నేతకు తాజ్ ఆహ్వానం

ముంబై: ఎన్ఎస్జీ మాజీ కమాండో, ఆప్ నేత సురేందర్ సింగ్ ను ముంబైలోని తాజ్ హోటల్ యాజమాన్యం విందుకు ఆహ్వానించింది. 26/11 ముంబై దాడుల సందర్భంగా సురేందర్ వీరోచితంగా పోరాడి ఇద్దరు ముష్కరులను హతమర్చారని, అందుకే ఆయను ఇలా గౌరవించాలనుకున్నామని తాజ్ ప్రతినిధి రఘు రామ్ తెలిపారు. ఉగ్రవాద చర్యలను ఎదుర్కోవడంలో అత్యంత సాహసం ప్రదర్శించిన సురేందర్ ను గౌరవించడం సంతోషంగా ఉందని రఘు రామ్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన ట్విట్టర్ షేర్ చేశారు. 26/11 దాడిలో అసువులు బాసిన వారికి గురువారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముంబైలో అనేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో తాజ్ హోటల్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.

2008లో  ముష్కరులు తాజ్ హోటల్ పై దాడి చేసినపుడు ఎన్ఎస్జీ కమాండో గా విధుల్లో ఉన్న సురేందర్, అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపారు. దాదాపు పది మంది పాకిస్తాన్ జీహాదీలు ముంబై నగరంలో బాంబులతో దాడిచేసి, విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడడంతో 166 మంది చనిపోగా వందల సంఖ్యలో గాయపడ్డారు. 26 నవంబర్ నుండి 29 నవంబర్ వరకూ మూడు రోజుల పాటు ముష్కర మారణకాండ కొనసాగింది.

మరిన్ని వార్తలు