ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు..

1 Oct, 2016 17:30 IST|Sakshi
ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు..

ఉడీ దాడిపై ప్రతీకారానికి పూనుకున్న భారత జవాన్లకు బీఎస్పీ చీఫ్ మాయావతి అభినందనలు తెలియజేశారు. సర్జికల్ స్ల్రైక్స్ చేయడం మంచిపనేనంటూ ప్రభుత్వానికి తన మద్దతు తెలిపిన ఆమె.. ఇటువంటి దాడులకు ప్రభుత్వం జనవరిలో జరిగిన పఠాన్ కోట్ దాడి తర్వాతే అనుమతి ఇచ్చి ఉండాల్సిందన్నారు.

ప్రజారక్షణకు ఆర్మీ ఇచ్చిన వాగ్దానాన్ని ఎల్వోసీ దాటిమరీ విజయవంతంగా పూర్తి చేయడం ఎంతో ఆనందంగా ఉందని మాయావతి అన్నారు. భారత ఆర్మీ జవాన్లకు ఈ సందర్భంలో ఆమె అభివందనాలు తెలియజేశారు. అయితే ఇప్పటికే భారత ప్రభుత్వం చాలా ఆలస్యం చేసిందన్న ఆమె... ఇటువంటి ప్రయత్నానికి మోదీ.. జనవరిలో జరిగిన పఠాన్ కోట్ దాడి తర్వాతే అనుమతి ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయ పడ్డారు. ఉడీలో ఆర్మీ స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసి 19 మంది జవాన్ల మరణానికి కారణమయ్యారని, ఇప్పటికైనా భారత ప్రభుత్వం తగిన విధంగా స్పందించడాన్ని ఆమె సమర్థించారు. ఉగ్రదాడిపై కీలెరిగి వాత పెట్టిన భారత ఆర్మీకి హాట్సాఫ్ చెప్పారు. ఎల్వోసీ దాటి మరీ ఉగ్రవాదుల స్థావరాలపై దాడులతో ఆర్మీ భారత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని విజయవంతంగా పూర్తి చేసిందని మాయావతి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదేకానీ కాస్త ఆలస్యంగా స్పందించారంటూ మాయావతి ఆరోపించారు. పఠాన్ కోట్ దాడి తర్వాతే ఇటువంటి నిర్ణయం తీసుకుని ఉంటే.. ఉడీ దాడిలో 19 మంది భారత జవాన్ల జీవితాలు సేవ్ అయ్యుండేవని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు