ఆ మాజీ సీఎం.. అవినీతిమయం: మోదీ

29 May, 2017 20:09 IST|Sakshi
ఆ మాజీ సీఎం.. అవినీతిమయం: మోదీ

బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ భార్య రబ్రీదేవి అవినీతి పురాణాన్ని బీజేపీ సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ బయటపెట్టారు. ఆమె ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నాటి మంత్రి అబ్దుల్ బారీ సిద్దిఖీ, మాజీ మంత్రి సుధా శ్రీవాస్తవలకు కేటాయించిన విలువైన భూమిని కారు చవగ్గా లాగేసుకున్నారని ఆయన ఆరోపించారు. సిద్ధిఖీ, సుధా శ్రీవాస్తవలకు ఎమ్మెల్యే కోఆపరేటివ్ సొసైటీ కేటాయించిన భూమిని ముఖ్యమంత్రిగా తన అధికారాన్ని దుర్వినియోగం చేసి లాక్కున్నారని ఓ ప్రకటనలో చెప్పారు. 1992-93లో ఎమ్మెల్యేల సహకార సంఘం 5.59 డెసిమల్ భూమిని వారిద్దరికీ రూ. 37వేల వంతున కేటాయించగా, పదేళ్ల తర్వాత కూడా రబ్రీదేవి వారి నుంచి అదే ధరకు భూమి తీసుకున్నారని అన్నారు. ఇప్పుడు ఆ భూమి విలువ కోట్లలో ఉంటుందని తెలిఆపరు.

రబ్రీదేవి 1997 నుంచి 2005 వరకు బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆర్జేడీ నేతలు రఘునాథ్ ఝా, కాంతి సింగ్ లాంటి వాళ్లు తేజస్వి, తేజ్‌ప్రతాప్ యాదవ్‌లకు తమ విలువైన భూములను చవగ్గా ఇచ్చినట్లే.. అప్పట్లో రబ్రీదేవికి కూడా వాళ్లిద్దరూ నామమాత్రపు ధరలకు ఎందుకు ఇచ్చారని సుశీల్ మోదీ ప్రశ్నించారు. ఎమ్మెల్యేల సహకార సంఘం చైర్మన్ జయప్రకాష్ నారాయణ్, కార్యదర్శి భోలా యాదవ్ ఇద్దరూ లాలు ప్రసాద్ సన్నిహిత సహచరులేనని, వాళ్లు తాము భూములు కేటాయించిన వారి జాబితాలను ఎందుకు బహిర్గతం చేయడం లేదని నిలదీశారు.

మరిన్ని వార్తలు