కేంద్ర సమాచార చీఫ్ కమిషనర్గా సుష్మా సింగ్

5 Dec, 2013 13:33 IST|Sakshi

కేంద్ర సమాచార చీఫ్ కమిషనర్ (సీఐసీ)గా సీనియర్ అధికారిణి సుష్మా సింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెలలో పదవీ విరమణ పొందనున్న దీపక్ సంధు స్థానంలో నియమితులయ్యారు. ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్, న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్తో కూడిన ప్యానెల్ సుష్మా సింగ్ నియామకంపై ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది.

సంధు తర్వాత సీఐసీగా బాధ్యతలు చేపడుతున్న రెండో మహిళ సుష్మానే. ఐఏఎస్ అధికారిణిగా రిటైరయ్యాక 2009లో సమాచార కమిషనర్గా ఆమె నియమితురాలయ్యారు. కేంద్ర సమాచార కమిషన్లో అందరికంటే ఆమే సీనియర్.

మరిన్ని వార్తలు