‘సుష్మ స్పర్శ వారి జీవితాలను మార్చింది’

7 Aug, 2019 15:08 IST|Sakshi

తిరువనంతపురం: చెరగని చిరునవ్వుకు, నిండైన భారతీయతకు నిలువెత్తు నిదర్శనం సుష్మా స్వరాజ్‌. దేశ ప్రజలందరిని తన బిడ్డలుగా ప్రేమించగలిగిని అతి కొద్ది మందిలో సుష్మా స్వరాజ్‌ ఒకరు.  ప్రపంచ నలుమూలల ఉన్న భారతీయులు ఎవరూ సాయం కోరినా తక్షణమే స్పందించేవారు సుష్మా స్వరాజ్‌. ప్రాంతాలకు, పార్టీలకతీతంగా అభిమానులను సంపాదించుకున్న సుష్మా స్వరాజ్‌ మంగళవారం రాత్రి గుండె పోటుతో మరణించిన సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియా మొత్తం చిన్నమ్మ జ్ఞాపకాల్లో తరిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సుష్మకు సంబంధించిన ఓ ఫోటో ఇంటర్నెట్‌లో తెగ వైరలవుతోంది.

వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా హెచ్‌ఐవీ రోగులంటే చిన్న చూపు ఇంకా పోలేదు. నేటికి ఆ వ్యాధి పట్ల ఎన్నో అపోహలు. 2020లోనే ఇలా ఉంటే.. 2003 కాలంలో పరిస్థితులు ఎలా ఉండేవో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో హెచ్‌ఐవీ వ్యాధి బారిన పడిన ఇద్దరు చిన్నారులను దగ్గరకు తీసుకుని.. స్పర్శ, కౌగిలించుకోవడం ద్వారా ఈ వ్యాధి సంక్రమించదని సమాజానికి ఓ సందేశం ఇచ్చారు సుష్మా స్వరాజ్‌. ట్విటర్‌ యూజర్‌ పియు నాయర్‌ పోస్ట్‌ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది.

‘తల్లిదండ్రుల కారణంగా ఈ చిన్నారులకు ఎయిడ్స్‌ వ్యాధి సోకింది. దాంతో వీరు చదువుతున్న పాఠశాల యాజమాన్యం.. ఈ చిన్నారులను స్కూల్‌ నుంచి తొలగించింది. ఇతర ఏ స్కూల్‌లో కూడా వీరిని చేర్చుకో లేదు. దాంతో చిన్నారుల తాత ఈ విషయాన్ని అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై స్పందించిన కలాం వారు చదువుకోవడానికి మార్గం చూపడమే కాక ఈ పిల్లల కోసం ఓ ప్రత్యేక ట్యూటర్‌ని కూడా ఏర్పాటు చేశారు. వీరి గురించి తెలిసిన సుష్మా స్వరాజ్‌ ఆ రాష్ట్ర పర్యటన సందర్భంగా చిన్నారులను కలుసుకుని ప్రేమగా దగ్గరకు తీకున్నారు. స్పర్శ, కౌగిలించుకోవడం ద్వారా ఎయిడ్స్‌ వ్యాప్తి చెందదని తెలిపారు’ అంటూ నాయర్‌ ఈ ఫోటోని ట్వీట్‌ చేశాడు.

నేడు సుష్మా స్వరాజ్‌ చనిపోయారనే వార్త తెలిసి ఈ పిల్లల తాత తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ‘ఆ రోజు సుష్మాజీ నా మనవల పట్ల చూపిన ప్రేమ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. ఈ పిల్లల చదువకు అవసరమైన సాయం అందేలా సుష్మాజీ ఏర్పాట్లు చేశారు. ఆమె చేసిన మేలును జీవితాంతం మరవలేం’ అన్నారు. ఈ ఇద్దరు పిల్లల్లో ఒకరు 2010లో మృతి చెందగా.. మరొకరికిప్పుడు 23 ఏళ్లు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఇక అందమైన కశ్మీరీ యువతుల్ని పెళ్లిచేసుకోవచ్చు’

రామజన్మభూమి యాజమాన్య పత్రాలు పోయాయ్‌

లదాఖ్‌ నుంచి మరో ఉద్యమం!

‘సుష్మ.. నా పుట్టినరోజుకు కేక్‌ తెచ్చేవారు’

మాట తప్పారు దీదీ; స్మృతి భావోద్వేగం!

సుష్మా ప్రస్థానం: కాశీ నుంచి కర్ణాటక వరకు

‘ఎన్నికల్లో పోటీ చేయను.. ధన్యవాదాలు సుష్మ’

‘నన్ను అన్నా అని పిలిచేవారు’

మోదీ-షా తదుపరి టార్గెట్‌ అదేనా?

‘ఒక్క రూపాయి ఫీజు కోసం ఇంటికి రమ్మన్నారు’

‘మా అమ్మను హరి నివాస్‌లో బంధించారు’

పంజాబ్‌లో ఉగ్ర కుట్రకు స్కెచ్‌..

ప్రారంభమైన సుష్మా స్వరాజ్‌ అంతిమయాత్ర

ట్విటర్‌ ఫైటర్‌ను కోల్పోయా : పాక్‌ మంత్రి

నేల మీదే పడుకుంటా; సుష్మ భీష్మ ప్రతిఙ్ఞ!

చిన్నమ్మ మరిలేరు : చిన్నబోయిన బాలీవుడ్‌

ఆమెలా మారి అతడిలా మారిన వ్యక్తిని పెళ్లాడింది

ఢిల్లీ సుల్తానుల కోటను బద్దలు కొట్టిన సుష్మా

ఏడాదిలో ముగ్గురు మాజీ సీఎంలు మృతి

ప్రజలారా ఈ చిన్నమ్మను గుర్తుపెట్టుకోండి

వీరి భవితవ్యం ఏంటి?

అధీర్‌ వ్యాఖ్యలతో ఇరకాటంలో కాంగ్రెస్‌ 

ఇది గొప్ప సందర్భం: మోదీ

పీవోకే మనదే..!

కాంగ్రెస్‌లో కల్లోలం 

మేం పోరాడతాం కోర్టుకు వెళ్తాం

మాటలన్నీ తూటాలే!

సుష్మా చివరి ట్వీట్‌ ఇదే..

సుష్మాస్వరాజ్‌: ఏబీవీపీ నుంచి కేంద్ర మంత్రిగా..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అరేయ్‌.. మగాడివేనా? : తమన్నా

స్టార్‌ హీరో ఇంట విషాదం

బీ టౌన్‌ రోడ్డుపై ఆర్‌ఎక్స్‌ 100

పవర్‌ఫుల్‌ కమ్‌బ్యాక్‌

కామెడీ కాస్తా కాంట్రవర్సీ!

చాలెంజింగ్‌ దర్బార్‌